Header Banner

నిజమైన అభిమానం అంటే ఇదే! అభిమానుల ప్రేమ ఆచరణలో కనిపించడం గర్వకారణమన్న బాలయ్య!

  Tue Jun 10, 2025 20:54        Politics

తన జన్మదినం (జూన్ 10) సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల పట్ల ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు తన జీవితానికి మరింత అర్థాన్ని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామ గ్రామాన, మండల కేంద్రాల్లో అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. "ఈరోజు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నా జీవితానికి మరింత అర్థం ఇచ్చాయి," అని బాలకృష్ణ తన సందేశంలో పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

ముఖ్యంగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌లో తన అభిమానులు స్వయంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. "రక్తదానం అనేది జీవితాన్నే ఇచ్చే గొప్ప దానం. మీ ప్రేమ కేవలం మాటల్లో కాదు... ఆచరణలో, సేవలో, మానవత్వంలో చూపించటమే నాకు గొప్ప గర్వకారణం. నిజమైన అభిమానం అంటే ఇదే!" అంటూ అభిమానుల సేవానిరతిని కొనియాడారు. ఒకటి రెండు కాదు, ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చే మంచి పనులు చేయడం అభిమానుల విశాల హృదయానికి నిదర్శనమని బాలకృష్ణ అన్నారు. ఈరోజు తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ, ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి సహృదయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ, మద్దతు తనకు జీవితాంతం స్ఫూర్తిగా నిలుస్తాయని, వారితో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఉత్సాహాన్ని తనలో నింపారని ఆయన వివరించారు. ఈ రోజును తన జీవితంలోని మరపురాని రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #balakrishna #Birthday #Celebrations #ServiceActivities #AndhraPradesh